ఏపీ సీఎం వైఎస్ జగన్ సినీ ప్రముఖులతో జరిగిన భేటీ రాజకీయంగా అదేవిధంగా సినిమా పరంగా సంచలనంగా మారింది.ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులతో భేటీ సమయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనాభా పరంగా సినిమా ధియేటర్ల పరంగా ఇంక రెవిన్యూ పరంగా తెలంగాణతో పోలిస్తే.ఏపీ నుండే అధికశాతం ఇండస్ట్రీకి అందుతుందని పేర్కొన్నారు.
సినిమా టికెట్ ధర గురించి మాట్లాడుతూ.అందరికీ ఆమోదయోగ్యం.
మంచి నిర్ణయం త్వరలో వస్తుందని న్యాయం జరిగేలా రేట్లు ఉంటాయని పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో మీరందరూ కూడా వైజాగ్ కి వస్తే ఇళ్లస్థలాలు ఇస్తాం.స్టూడియోలు నిర్మించాలనుకున్నా.సహకరిస్తాం… జూబ్లీహిల్స్ మాదిరి ప్రాంతాన్ని వైజాగ్ లో నిర్మించుకునే దిశగా అడుగులు వేద్దామని టాలీవుడ్ ప్రముఖుల కు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.కొద్దిపాటి ప్రోత్సాహం విశాఖపట్టణానికి కల్పిస్తే.హైదరాబాద్, చెన్నై, బెంగళూరు.
మాదిరి సిటీ అవుతుందని.అన్నారు.
దానికి మీ ప్రోత్సాహం అవసరం అని కోరారు.ఇక ఇదే సమయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు.
టాలీవుడ్ ప్రముఖుల నుండి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది.