నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్,క్లీనర్ తో సహా పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై 65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు.
ట్రాఫిక్ కు క్లియర్ చేసే పనిలో ఉన్నారు.