ట్రంప్ చీటి చిరిగిపోయినట్టేనా...2024 ఎన్నికలకు అనర్హుడేనా...??

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2024 లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు అనర్హుడు అవుతాడా, రాజకీయాల్లో ఇక పోటీ చేసే అవకాశమే లేదా, రాజ ద్రోహం నేరంతో అమెరికా జైల్లో ఊచలు లెక్కించాల్సిందేనా అంటే అవుననే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది క్యాపిటల్ హిల్ పై దాడి ఘటన.

ఈ ఘటనకు కారకులు ట్రంప్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అయితే ట్రంప్ ఈ దాడికి ప్రధాన సూత్రదారుడు అనే విషయం సాక్ష్యాదారాలతో తెలిస్తే తప్ప ట్రంప్ పై ఎలాంటి చర్యలు చేపట్టడానికి లేదు.

దాంతో సుదీర్ఘమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం నియమించిన కమిటి ట్రంప్ ఈ దారుణానికి ప్రధాన కారకుడు అనే నిర్ధారణకు వచ్చింది.అంతేకాదు అందుకు తగ్గట్టుగా ఆధారాలను కూడా సేకరించిందని తెలుస్తోంది.

ఘటన సమయంలో ట్రంప్ వద్ద ఉన్న అధికారులు ట్రంప్ ఈ దారుణానికి కారణమని వాంగ్మూలం ఇచ్చారట.ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన లిచ్ చెనీ ట్రంప్ పై వచ్చిన ఆరోపణలను ధ్రువీకరించారు కూడా.

Advertisement

దాంతో ట్రంప్ చుట్టూ మరించ ఉచ్చు బిగిస్తునట్టుగా నిపుణులు అంటున్నారు.త్వరలో

ఈ కేసుకు సంభందించి వాదోప వాదనలు జరగనున్నాయని ఈ సమయంలో ఎలాగైనా సరే ట్రంప్ ను దోషిగా కోర్టు ముందు నిలబెట్టాలి మరిన్ని సాక్ష్యాలను సిద్దం చేసుకుంటోంది కమిటి.ఇదిలాఉంటే వైట్ హౌస్ లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ సైతం ట్రంప్ మాయం చేసారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణలపై కూడా కమిటి దృష్టి పెట్టింది.

ట్రంప్ కోర్టు ముందు దోషిగా నిలబడటం ఖాయమని అదే జరిగితే ట్రంప్ జైలుకు వెళ్ళడమే కాకుండా 2024 ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవడమే కాకుండా రాజద్రోహ ముద్ర పడుతుందని అంటున్నారు పరిశీలకులు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు