నల్లగొండ జిల్లా:జాతీయ రహదారి ప్రమాదాలను నివారించడానికి ఫ్లై-ఓవర్ బ్రిడ్జిలను,సర్వీస్ రోడ్ల విస్తరణను,సబ్-వేల పెంపును నిర్మాణం చేయాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారుల పిడి పిల్లి నాగేశ్వరరావుకి మెమోరాండం అందజేశారు.ఆ మెమోరాండంలో ఈ క్రింది అంశాలను పొందుపరిచారు.1.ప్రమాదాలు జరుగనున్న చిట్యాలలో ఫ్లై-ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి.2.చిట్యాలలో జనావాసాల చివరి వరకు అంటే రైల్వే దారి వరకు కుడి ఎడమల సర్వీస్ రోడ్డును విస్థరించాలి.3.నకిరేకల్,నార్కట్‌పల్లి బైపాస్ లలో తారు రోడ్ధు వేయకుండా ఆపిన సర్వీస్ రోడ్లకు వెంటనే కుడి ఎడమల పక్కా తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలి.4.తెలంగాణ రాష్ట్రంలో పశువుల సంతకు ప్రతీతి చెందిన కట్టంగూర్ లో సబ్-వే రోడ్డు ఇరుకుగా మారడం తీవ్ర అసౌకర్యంగా ఉంది.మరో సబ్-వే నిర్మాణం చేపట్టాలి.5.కట్టంగూర్ సర్వీస్ రోడ్డును కురుమర్తి దారి వరకు విస్తరించి ప్రమాదాలను నివారించాలి.6.చౌటుప్పల్,గుండ్రాంపల్లి,వెలిమినేడు,చిట్యాల, కట్టంగూర్,అయిటిపాముల,నకిరేకల్,ఇనుపాముల, కొర్లపహాడ్,కేతెపల్లిలలో GMR ధ్వంసం చేసిన మురికి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేయాలి.7.నకిరేకల్ పెద్ద చెఱువు నీరు ఫ్లై-ఓవర్ క్రింద పవహించే ప్రవాహాన్ని రవాణాదారులకు ప్రజలకు ఆటంకం లేకుండా దారి మళ్ళించాలి.8.రహదారి వెంట జనావాసాల వద్ద GMR వేసిన సోడియం గ్రుడ్డి బల్బులను తొలగించి,వాటి స్థానంలో అత్యంత ప్రకాశవంతమైన LED బల్బులను వేయాలి.9.వ్యాపార వాణిజ్యం పేరుతో సర్వీస్ రోడ్లను ఆక్రమించినవారిని నియంత్రించి,ప్రజల ఆస్థులను కాపాడాలి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదు నుండి నల్లగొండ జిల్లాలో వెళ్ళే విజయవాడ 65 జాతీయ రహదారి నిర్మాణాన్ని ప్రమాదాల నుండి నివారించడంలో జి.ఎం.ఆర్.విఫలమయ్యిందని,తాము ప్రతిపాదించే ప్రతిపాదనలను అమలు చేసేదానికి భారత ప్రభుత్వంతో మాట్లాడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు.ఈరోజు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని హైవే- పిడి కార్యాలయంలో పిడి పిల్లి నాగేశ్వరరావుని కలిసి క్రింది అంశాలపై మెమోరాండాన్ని అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో PRPS నాయకులు నాగిళ్ళ యాదయ్య,ముప్పడి మారయ్య,యార పాండు,పోతేపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.