పేట సిగలో పారిశ్రామిక కిరీటం...!

సూర్యాపేట జిల్లా:అభివృద్ధిలో పరుగులు పెడుతున్న సూర్యాపేట ఒడిలో ఇమామ్ పేట ఆటోనగర్ మరో మణిహారం కానుంది.జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఇమామ్ పేటలో ఆటోనగర్ నిర్మాణానికి సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

 Industrial Crown In Peta Cigalo ,peta Cigalo-TeluguStop.com

ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 69 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ మేరకు శనివారం ఉదయం ఇమామ్ పేటలోని ఆటోనగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఎండి నర్సింహారెడ్డి,జిల్లా కలెక్టర్ వెంకట్రావు,ఆర్డీవో ఇతర అధికారులతో కలిసి ఆటోనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి చొరవతో త్వరలో వందలాది పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.తాజాగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ పార్క్‌తో యువతకు,కార్మికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.ఈ మేరకు నిర్మాణాలను కోసం రూ.16 కోట్ల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.సకల హంగులతో అద్భుత నిర్మాణాలు,కార్మికభవనం, ఈఎస్ఐ ఆసుపత్రి,విశాల రహదారులు, అబ్బురపరిచే కమాన్ లు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఇమామ్ పేట ఇండస్ట్రియల్ పార్క్ లో నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి.పారిశ్రామిక పార్క్ ముందు ఆకట్టుకునే కమాన్, ముందు రహదారి నుండి చివరి వరకు విశాలమైన రహదారులు,కార్మికుల శ్రేయస్సు కోసం కార్మిక సంక్షేమ భవనం,వారి ఆరోగ్యంకోసం సకల సదుపాయాలతో ఈఎస్ఐ ఆసుపత్రి వంటి నిర్మాణాలు కొలువు దీరనున్నాయి.

నిర్మాణాలనాణ్యతలో రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులకు సూచించారు.అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.అత్యాధునిక పారిశ్రామిక పార్క్ లో ఇంకా చేపట్టవలసిన నిర్మాణాలు,సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధాంత చేయాలని అధికారులను ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube