గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు.రెండు బిల్డింగులు,నాలుగు రోడ్లు వేసి అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం కాదని, సామాన్యుడికి విద్య, వైద్యం,మెరుగైన సదుపాయాలు కల్పించినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు.51వ నెంబర్ జవోను రద్దుచేసి 60 వ,జీవోను అమలు చేసి,పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 The Problems Of Gram Panchayat Workers Should Be Resolved Immediately, Gram Panc-TeluguStop.com

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.14వ తారీకు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అసమర్థత పరిపాలన కొనసాగుతుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిహెచ్.గోపాల్ రెడ్డి,నామ ప్రవీణ్, దొంతి రెడ్డి సైదిరెడ్డి, గునగంటి మల్సూరు, దండా అరవింద్ రెడ్డి, దేవేందర్,స్వామి నాయుడు,శ్రీనివాస్ నాయుడు,బైరు మహేష్ గౌడ్,బిచ్చ నాయక్, మల్లారెడ్డి,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube