సూర్యాపేట జిల్లా:తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రవేశపెట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీల్లో భాగంగా నేడు నూతనకల్ మండల కేంద్రంలోని ప్రజా పాలన కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్( Mandula Samel ) ముఖ్యాతిధిగా హాజరై మాట్లడుతూఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని,ప్రతీ ఒక్కరూ 6 గ్యారెంటీలకు ఖచ్చితంగా ధరఖాస్తు చేసుకోవాలని,ప్రజాపాలన దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని,ప్రజలు ఆందోళన చెందవద్దవద్దని
అన్నారు.
తెల్లరేషన్ కార్డు( white ration card ) లేని వారు ముందుగా తెల్ల కాగితంపై ఎమ్మార్వోకి ముందుగా దరఖాస్తు రాయవలెనని,రేషన్ కార్డు( Ration card ) ఫారంతో పాటు ఆరు గ్యారెంటీల ఫారం తప్పకుండా అప్లయ్ చేయాలన్నారు.గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ లు కూడా ఇవ్వలేదని,ఇది పేదల ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుందని,పెన్సన్ వితంతువులకు,వృద్దులకు రూ.4000,వికలాంగులకు రూ.6000 ఇస్తుందని,ఈ అన్ని పథకాలు మీకు అందాలంటే ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోని రషీదు పొందాలన్నారు.తుంగతుర్తి నియోజకవర్గం కి కాళేశ్వరం జలాలు ఎనిమిదవ తారీఖున వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో పిడి రవి కుమార్,ఏంపిపి కళావతి, జడ్పిటిసి దామోదర్ రెడ్డి, సర్పంచ్ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.