సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు.అంతరాష్ట్ర సరిహద్దులో పటిష్టమైన నిఘా ఉంచామని,రామాపురం క్రాస్ రోడ్డు,మట్టపల్లి బ్రిడ్జి, దొండపాడు,పులిచింతల ప్రాజెక్ట్,చింత్రియాల,బుగ్గ మాదారం వద్ద అంతరాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి,ఆంధ్రరాష్ట్ర అధికారుల సమన్వయంతో పని చేస్తూ అక్రమ రవాణా అడ్డుకుంటున్నామన్నారు.
అలాగే అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులకు అనుబంధంగా అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు నేషనల్ హైవే 65 పై టేకుమట్ల,బీమారం, పాత తిరుమలగిరి, వెలిషాల,మామిళ్లగూడెం, శాంతినగర్,చిల్లేపల్లి, కుంటపల్లి వద్ద ఏర్పాటు చేశామన్నారు.పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖల అధికారుల సహాయంతో జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తన్నామన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 1 కోటి 71 లక్ష నగదు,7లక్షల 75 వేల మద్యం,20 వేల గంజాయి,1 కోటి 14 లక్షల ఆభరణాలు,86 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు.అలాగే ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 75 లక్షల విలువగల మద్యం సీజ్ చేశారని,జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అన్నీ కలుపుకొని మొత్తం 4 కోట్ల 55 లక్షలు సీజ్ చేశామని పేర్కొన్నారు.