సూర్యాపేట జిల్లా:కోదాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోదాడ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి క్రీడాకారులను ఆత్మీయంగా పలకరించి ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని,క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి వారికి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ సేవలు అభినందనీయమని,అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ పి.ఎన్.డి ప్రసాద్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామచందర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నర్సింహారావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందిరి నాగిరెడ్డి,కోశాధికారి రమేష్ బాబు,పందిరి ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఎస్.ఎస్.రావు, ఎస్.వెంకటేశ్వరరావు,బాగ్దాద్,నాగిరెడ్డి,పిఈటిలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.