ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా.ఇలా తొలిసారి కెప్టెన్ గా మారిన జడేజా గురించి ఓ సెన్సేషనల్ విషయం బయటపెట్టాడు పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.టీమ్ మేట్ జడేజాని మార్గమధ్యంలో బస్సు దింపి నడిపించాడని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
దీనికి కారణం జడేజా ప్రాక్టీస్ సెషన్ కు ఆలస్యంగా రావడమేనట.గ్రౌండ్‌లో చురుగ్గా ఉండే జడేజా ఐపీఎల్ మ్యాచ్ ల ముందు చాలా లేజీగా ఉండేవాడట.
అయితే మ్యాచ్ ల ముందు ప్రాక్టీస్ చేయడంలో బద్ధకంగా ఉండే జడేజాని చూసి షేన్ వార్న్ కి బాగా కోపం వచ్చేదట.అయితే ఎంత చెప్పినా అలాగే చాలా బద్ధకంగా జడేజా ప్రవర్తించడంతో ఒకరోజు వార్న్ అతడికి శిక్ష విధించాడని కమ్రాన్ అక్మల్ చెప్పాడు.
వార్న్ ఆకస్మిక మరణం తర్వాత అతనితో తాము గడిపిన క్షణాలను చాలా మంది క్రికెటర్లు షేర్ చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే 2008లో ఆర్ఆర్ టీమ్ మెంబర్ అయిన పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వార్న్ గురించి తెలియని చాలా విషయాలు బయట పెట్టాడు.
ఇందులో భాగంగా ప్రాక్టీస్, టీమ్ మీటింగ్స్ కు ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లపై వార్న్ బాగా కోప్పడేవాడని వెల్లడించాడు.

అక్మల్ మాట్లాడుతూ.2008లో ఐపీఎల్ జరుగుతున్న టైంలో రవీంద్ర జడేజా, యూసఫ్ పఠాన్ ప్రాక్టీస్ సెషన్‌కు కాస్త లేటుగా వచ్చారు.అప్పుడు వార్న్ వారిపై కోపం వచ్చినా ఏమీ అనలేదు.
కానీ ప్రాక్టీస్ అయిపోయి హోటల్‌కి బస్‌లో వెళ్తుండగా.వార్న్ డ్రైవర్‌ను బస్ ఆపమన్నాడు.
తర్వాత లేటుగా వచ్చినందుకు బస్సు దిగి హోటల్‌కి నడుచుకుంటూ రండి అని జడేజా, పఠాన్‌లను ఆదేశించాడు.ఆ ప్లేస్ నుంచి హోటల్‌కు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఆ ప్లేస్ నుంచి వాళ్ళిద్దరూ నడుచుకుంటూ హోటల్ కు వచ్చారు ‘ అని చెప్పుకొచ్చాడు.







