సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మున్సిపాలిటీపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని హుజూర్నగర్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ గెల్లి అర్చనా రవి అన్నారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎన్నికైన నాటి నుంచి మున్సిపాలిటీ పరిధిలో లే అవుట్ స్థలాలకు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా అన్నీ లే అవుట్లకు కవచాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.కోర్టులో ఉన్న స్థలాలకు ఏ విధంగా రక్షణ కంచెలను ఏర్పాటు చేస్తారని ఆమె ప్రశ్నించారు.2018 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మున్సిపాలిటీలో అనేక అవకతవకలు జరిగాయని ఆమె విమర్శించారు.హుజూర్నగర్ లో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూడలేక మున్సిపాలిటీలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన ప్రతి అధికారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ వారిపై బురద జల్లటం కాంగ్రెస్ నాయకులకు పరిపాటిగా మారిందన్నారు.
హుజూర్నగర్ అభివృద్ధికి పాటుపడకుండా రాజకీయ మనుగడ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గురవుతున్నారని,ఇలా దిగజారి అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు.ఇప్పటికైనా వారి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.