మాజీ మంత్రుల మధ్య రాజకీయ జగడం

సూర్యాపేట జిల్లా:గత పదేళ్లుగా అధికారంలో ఉండి,జిల్లా మంత్రిగా పాలన చేసిన మాజీ మంత్రి,ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అభివృద్ధి ముసుగులో అంతులేని అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందా? నిజంగా అవినీతి జరిగితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఆయన అవినీతిపై విచారణ జరిపి అవినీతి సొమ్మును రికవరీ చేస్తారా? జగదీష్ రెడ్డిని కటకటాల్లోకి పంపిస్తారా?అనే ప్రశ్నలు తాజాగా సూర్యాపేట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మరాయి.దీనికి కారణం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి చేసిన కామెంట్స్ అని అంటున్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్,పాత మున్సిపాలిటీలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని, చిరు వ్యాపారుల కోసం రూ.37 కోట్లతో నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణంలో కూరగాయల వ్యాపారులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టలేదని,కనీస సౌకర్యాలు వసతులు కూడా లేవని,పైనపటారం లోన లొటారంగా ఉందని, ఆడంబరానికే నిర్మాణాలు చేపట్టారు తప్ప ప్రజలకు ఉపయోగకరంగా లేవని, ఈ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.వీటన్నిటిపైన త్వరలోనే విచారణ చేపడతామని,దోషులను ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు.ఇదే అంశం ఇప్పుడు సూర్యాపేట రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.సూర్యాపేటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య నడుస్తున్న రాజకీయ రచ్చ చివరికి ఏ రూపం దాల్చి,ఎంత వరకు వెళుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

 Political Tussle Among Ex-ministers , Ex-ministers, Ramireddy Damodar Reddy, Con-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube