సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియజకవర్గంలో కురిసిన ఆకాల వర్షం అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి పంటలు నేల కొరిగాయి, నేరేడుచర్ల పట్టణ పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది,ఈ వర్షం ధాటికి చేతికొచ్చిన పంట పొలాలు కింద పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు,దీంతో రైతులకు అపార నష్టం కలిగింది.
ఈ ఏడాది పంటలు దిగుబడి వచ్చాయి అనుకుంటున్న సమయంలో అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిలించింది.పాలకవీడు మండల ప్రాంతాలలో పత్తి తడిసి ముద్దయింది.
ఈ వర్షంతో అన్నదాతలు దిగులు చెందుతూ ప్రభుత్వ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని వేడుకుంటున్నారు.