సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ లోని లారీ ట్రాన్స్పోర్ట్ లో గురువారం అర్ధరాత్రి లారీ పూర్తిగా దగ్ధమైంది.ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్ ఆవరణలో సుమారు 500 లకు పైగా లారీలు ఉన్నాయని, అంతే కాకుండా ట్రాన్స్పోర్ట్ పక్కనే పెట్రోల్ బంకు సైతం ఉండడంతో ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఫైర్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించలేదని,మిగతా లారీలకు అంటుకొని ఉంటే పెను ప్రమాదం సంభవించేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆగి ఉన్న లారీలో మంటలు లేవడానికి షాట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందన్నారు.