చెట్ల పొదల్లోకి వెళుతున్న ప్రేమికులే టార్గెట్

సూర్యాపేట జిల్లా:ప్రేమ జంటల వీడియోలు రహస్యంగా తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు ఉండ్రుగొండ గుట్టల్లోని చెట్ల పొదల్లోకి వచ్చే ప్రేమికుల ఏకాంత వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నాడు.

 The Target Is The Lovers Going Into The Groves Of Trees-TeluguStop.com

గత సంవత్సర కాలంగా ఇలాంటి వీడియోలు తీస్తూ ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అతడి మొబైల్ లో సుమారు 100 ప్రేమ జంటల ఫోటోలు,వీడియోలు ఉన్నట్లు గుర్తించి యువకుడిని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు రహస్య విచారణ చేపడుతూ రామకృష్ణతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేస్తున్నారు.ఉండ్రుగొండ సర్పంచ్ శైలజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని చివ్వెంల ఎస్సై పి.విష్ణు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube