ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మౌనం దేనికి సంకేతం?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించి పలు రాజకీయ పార్టీల అధినేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు.

 What Is The Sign Of Trs's Silence In The Vice-presidential Election Telangana, V-TeluguStop.com

జాతీయ స్థాయిలో తనతో కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు.ఇందులో భాగంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు.

ఈ మేరకు ఆయన నామినేషన్ కార్యక్రమంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ పాల్గొన్నారు.ఇటీవల పోలింగ్‌లోనూ టీఆర్ఎస్ నేతలు సిన్హాకే ఓటేశారు.

అయితే దేశంలో రాష్ట్రపతి ఎన్నికతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.ఇప్పటికే ఉపరాష్ట్రపతికి నామినేషన్‌లు కూడా దాఖలయ్యాయి.విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా కాంగ్రెస్ నేత మార్గరేట్ అల్వా నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్ హాజరు కాలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరేట్ అల్వాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ప్రచారం జరుగుతోంది.రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అంటే టీఎంసీ అభ్యర్థి.

కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్ అల్వా కాంగ్రెస్ పార్టీ నేత కావడంతో టీఆర్ఎస్ పార్టీకి చిక్కుల్లో పడింది.మద్దతిస్తే తెలంగాణలో పోటీగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చినట్లు అవుతుంది.

ఇవ్వకపోయినా విమర్శలు వస్తాయి.దీంతో మౌనం వహించడమే ఉత్తమం అని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

Telugu Congress, Sharad Pawar, Telangana, Trs-Telugu Political News

అటు రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్ధి సమయంలో సీఎం కేసీఆర్‌కు విపక్షాల కూటమి కీలక నేత శరద్ పవార్ ఫోన్ చేసి చర్చించారు.మద్దతుపై మాట్లాడారు.వెంటనే కేసీఆర్ అంగీకారం తెలిపారు.అందుకే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు.అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో శరద్ పవార్ కేసీఆర్‌కు ఫోన్ చేసి చర్చించారా లేదా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube