శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎర్రమంచి లో ప్రైవేట్ ల్యాండ్ లో హెలికాప్టర్ ల్యాండ్ అయింది.ఎర్రమంచిలోని జాతీయ రహదారి ప్రక్కన హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడంతో చూడటానికి జనం అధిక సంఖ్యలో గుమిగూడారు.
వున్నట్టుండి హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో పోలీసులు హైరానా పడ్డారు.స్థానిక కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటరమణ అక్కడికి చేరుకుని అనుమతి ఉందా లేదా అని విచారించారు.
టేఫె (teffay) ట్రాక్టర్ ఛైర్మెన్ మల్లికా శ్రీనివాసన్ ఆ హెలికాప్టర్ లో వచ్చినట్లు తెలుసుకున్నారు.కియా కార్ల పరిశ్రమ సమీపంలో యర్రమంచి పొలంలో ట్రాక్టర్ సంస్థ ఏర్పాటుకు మల్లికా శ్రీనివాసన్ స్థల పరిశీలన చేశారు.
రోడ్డు పక్కన ల్యాండ్ అయిన హెలికాప్టర్ ని చూడడానికి జనం తరలిరావడంతో దాదాపు అరగంట పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.







