ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్ష

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో టెట్ పరీక్షలను పకడ్బందీగా చేపట్టామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.

 Tet Exam That Ended Calmly-TeluguStop.com

ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టరు ఉదయం పట్టణంలోని 60 ఫీట్స్ రోడ్డులో గల కాకతీయ కాన్సెప్ట్ హై స్కూల్,జెడ్.పి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కేంద్రాలను అలాగే పోలీస్ స్టేషన్ నుండి కేంద్రాలకు పంపే ప్రశ్న పత్రాల తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్ష కేంద్రంలోని అన్ని ఎక్జాం హాల్ కి వెళ్లి పరిశీలించారు.సెంటర్ లోని ఏర్పాట్లను ఇతర సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ఉదయం 58 సెంటర్లలో టెట్ I పేపర్ పరీక్షకు 13 727 మంది అభ్యర్థులకు 11701 మంది హాజరు కాగా 2026 మంది గైరాజరు అలాగే టెట్ II పరీక్ష పేపర్ 12010 మంది అభ్యర్థులకి 10462 మంది హాజరు కాగా 1548 గైర్హాజరు అయ్యారని తెలిపారు.ఎక్కడకూడా ఎలాంటి సంఘటనలు జరగలేదని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్,డి.ఈ.ఓ అశోక్, పోలీస్,విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube