బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదో అందరికీ తెలిసిందే.ఇందులో ఉండే పోషక విలవలు.
ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.అయితే కేవలం బొప్పాయి పండే కాదు.
బొప్పాయి ఆకులు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.ఎన్నో జబ్బుల నుంచి బొప్పాయి ఆకులు రక్షిస్తాయి.
ముఖ్యంగా డేంగ్యూ బారిన పడినప్పుడు ప్లేట్ లెట్స్ పడిపోతుంటారు.ఈ సమయంలో బొప్పాయి ఆకుల రసం తీసుకోమని స్వయంగా వేద్యులే చెబుతుంటారు.
ఎందుకంటే, బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్ లెట్స్ పెంచే.డేంగ్యూ బారి నుంచి రక్షిస్తాయి.ఇక బొప్పాయి ఆకులతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం వింటర్ సీజన్‌లో ఉన్నాము.
ఈ సీజన్‌లో రోగాలతో పాటు చర్మ అలర్జీలు కూడా ఎక్కువగానే వేధిస్తుంది.అయితే అలర్జీల సమస్యతో బాధ పడుతున్న వారికి బొప్పాయి ఆకులు గ్రేట్‌గా సహాయపడతాయి.
బొప్పాయి ఆకులను మొత్తగా పేస్ట్.అలర్జీ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.

ఓ పది లేదా పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి.అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల ఎటువంటి ఎలర్జీ అయినా తగ్గుముఖం పడతాయి.మరియు దురదలు కూడా పోతాయి.అలాగే బొప్పాయి ఆకుల రసం వారినికి రెండు సార్లు సేవించడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగుతుంది.ఫలితంగా రోగాల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.

బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలు, విష పదార్థాలు సులువుగా బయటకు వచ్చాయి.అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలిగే శక్తి కూడా బొప్పాయి ఆకులకు ఉంది.కాబట్టి, మధుమేహం ఉన్న వారు బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే.రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులోకి వస్తాయి.ఇక సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి కూడా బొప్పాయి ఆకుల్లో ఉంటుంటి.అందువల్ల.
బొప్పాయి ఆకుల రసంను రెగ్యులర్‌గా కాకపోయినా.అప్పుడప్పుడు అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి.