సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఏవిఎం పాఠశాల ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రాయడానికి ఒకరికి బదులు మరొకరు హాజరైన ఘటన వెలుగుచూసింది.పరీక్షకు హాజరైన అభ్యర్థుల హల్ టికెట్స్ ను ఇన్విజిలేటర్ పరిశీలిస్తుండగా షేక్ మోహినోద్దీన్ అనే అభ్యర్ధి హల్ టికెట్ ఫోటోకి పరీక్ష రాస్తున్న అభ్యర్థికి పెద్ద మొత్తంలో వయసు తేడా ఉండటాన్ని గుర్తించి పట్టుబడి చేసినారు.
పరీక్ష రాయాల్సిన షేక్ మోహినోద్దీన్ కు 45 సంవత్సరాలు ఉండగా పరీక్ష రాయడానికి వచ్చినది మాత్రం మైనర్ బాలుడు(17) కావడం గమనార్హం.ఈ విషయంపై పరీక్షల స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.