సూర్యాపేట జిల్లా:అండర్ 19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు కోదాడకు చెందిన క్రీడాకారుడు సమీర్ ఎంపికైనట్లు కోదాడ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు,క్రికెట్ క్రీడాకారుడు షేక్ అబూబకర్ సిద్ధిక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.కోదాడకు చెందిన సమీర్ తమ అకాడమీలో శిక్షణ పొంది,నిరంతర సాధనతో ఈ ఘనత సాధించాడని తెలిపారు.
ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు తండ్రి మస్తాన్ హైదరాబాద్ లో కోచ్ గౌస్ బాబా వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పించారని తెలిపారు.సమీర్ హైదరాబాదులో రంజీ ఐపీఎల్ క్రీడాకారులతో నిత్యం సాధన చేసి మెలుకువలు నేర్చుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సెంచరీలు సాధించాడని తెలిపారు.
అతని ప్రతిభను గుర్తించిన బీసీసీఐ సెలెక్టర్లు అండర్ 19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారని,నవంబర్ 5 నుండి జరిగే కూచ్ బీహార్ అండర్ 19 ట్రోఫీలో రాష్ట్ర జట్టు నుండి సమీర్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సమీర్ ను కోదాడకు చెందిన పలువురు క్రీడాకారులు మిత్రులు, బంధువులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.