సూర్యాపేట జిల్లా:దేశంలో కుల గణంకాలు తప్పనిసరిగ్గా చేపట్టాల్సిందేనని లేదంటే యుద్దమేనని బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగాచారి హెచ్చరించారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చామల విజయలక్ష్మి హాల్లో,చామల అశోక్ అధ్యకతన జరిగిన బిసి హక్కుల సాధన సమితి 2వ మహాసభకు ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జనగణనతో పాటు,కులగణన కూడా చేపట్టాలని,అప్పుడే వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులు తెలుస్తాయని,వారి ఆర్థిక,సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చని అన్నారు.
స్వాతంత్ర్యం రాక ముందు 1931 లో బ్రిటిష్ వారు చేసిన సర్వే రిపోర్ట్ నే నేటికి కొనసాగించడం సిగ్గుచేటన్నారు.బిజెపి ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో కులగణన చేపట్టలేమని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి తప్పించుకుందామని చూస్తోందన్నారు.కులగణనతో ఆయా తరగతుల సంఖ్య,ఆర్థిక అసమానతలు బయటపడి హక్కులకై పోరాటాలు చేస్తే తమ మత ఎజెండా ముందుకు పోదనే దురుద్దేశంతోనే బిజెపి కులగణన చేపట్టడం విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ తీర్మానంతో చేతులు దులుపుకోవడం కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా టీఆర్ఎస్ వైఖరి ఉండాలని కోరారు.ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేసే జన గణనలో ఎస్సి,ఎస్టీలతోపాటు బీసీలు తదితర కులాల వారి గణన చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
శాస్త్ర,సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన మనం కులగణన చేపట్టడం కష్టమేమీ కాదన్నారు.కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి దాట వేస్తుందన్నారు.
మహారాష్ట్ర,తమిళనాడు.బీహార్,ఒరిస్సా,జార్కండ్,తెలంగాణ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయని గుర్తు చేశారు.
వామపక్ష పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు.కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని,రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన వివరాలను బయట పెట్టాలని,బీసీలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు,బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేసి 20 వేల కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ ధూళిపాల ధనంజయ నాయుడు స్వాగతం పలకగా వ్యవసాయ కార్మిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బెజయవాడ వెంకటేశ్వర్లు,బిసి సంఘం నాయకులు వెల్లంల యాదగిరి,అనంతుల మల్లేశ్వరి,మండవ వెంకటేశ్వరరావు,మూరగుoడ్ల లక్ష్మయ్య,దంతాల రాంబాబు,తోట్ల ప్రభాకర్,విద్యాచారి,దంతాల పద్మ రేఖ,దంతాల ధనలక్ష్మి,రావుల సత్యం,చిలకరాజు శ్రీను,ఎల్లబోయిన సింహాద్రి,హమాలి వర్కర్స తదితరులు సంఘాల నాయకులు పాల్గొన్నారు.