టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఉక్రెయిన్ లో చిత్రీకరించారు.ఆ సమయంలో ఉక్రెయిన్ లో రస్టీ అనే వ్యక్తి హీరో రామ్ చరణ్ కు బాడీగార్డు గా వ్యవహరించారు.
ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తిరిగి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే.
ఉక్రెయిన్ దేశం పై రష్యా దాడి చేస్తోంది.ఈ క్రమంలోనే సామాన్య పౌరులు కూడా ఉక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు.అందుకోసం యుద్ధం కూడా చేస్తున్నారు.రామ్ చరణ్ కు బాడీగార్డ్ గా వ్యవహరించిన రస్టీ తండ్రి 80 ఏళ్ల వయసులో కూడా ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ఫై రష్యా దాడులు జరుపుతున్న సమయంలో రామ్ చరణ్ కు బాడీగార్డు గా వ్యవహరించిన రస్టీ కు రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగిమరీ తెలుసుకున్నారు.
అదేవిధంగా అతని కుటుంబం వివరాలు కనుక్కొని అతని కుటుంబం కోసం కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు రామ్ చరణ్.

ఆ డబ్బులతో రస్టీ కొంత మెడిసన్ కొన్నారు.ఇదే విషయాన్ని తెలియజేస్తూ రస్టీ ఆ వీడియోని విడుదల చేశారు.అదే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు.1920 బ్రిటిష్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షనల్ పిరియాడిక్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







