ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంతా టాలీవుడ్ పైన దృష్టి పెట్టింది.ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు నటీనటులు తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలు సినిమాల్లో నటిస్తూ ఉన్న విషయం తెలిసిందే.
కొంత మంది సెలబ్రెటీలు అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.మన తెలుగు హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్ లో సత్తాను చాటుతున్నారు.
ఒక టాలీవుడ్ హీరో అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది.చిత్రబృందం ఒకవైపు షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరొకవైపు పార్టీ మూడ్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ పొడక్షన్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించారు.ఈ వేడుకకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ ఆఫ్ టాక్ ది టౌన్ గా నిలిచింది.లైగర్ టీం అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ లో మెరిసారు.ఇక ఈ పార్టీ లో భాగంగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే కలిసి మాట్లాడుతూ ఉండగా వాళ్ళిద్దరికీ తెలియకుండా హీరోయిన్ ఛార్మి సీక్రెట్ గా వీడియో తీసింది.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.చిత్ర బృందం కూడా షూటింగ్ ను శరవేగంగా జరుగుతున్నారు.







