సూర్యాపేట జిల్లా:మద్యం కంటే కల్లు శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని,కల్లును సురా పానకం అంటారని,కల్లు ఆరోగ్యానికి మంచిదని,రోగాలకు సర్వవ్యాధి నివారిణిగా పని చేస్తుందని అంటుంటారు.తాటి ముంజలు తినడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుందని,శరీరాన్ని చల్ల బరుస్తోందని తెలుసు.
తాటి ఆకులతో ఇంటి కప్పు,తాటి మొద్దులు ఇంటి దూలాలుగా ఉపయోగ పడుతాయన్న విషయం అందరికీ విదితమే.మొత్తానికి తాటి చెట్లు,కల్లు గీసే గౌడ్లు ఈ సొసైటీకి మంచి చేసే వారే కానీ,హని చేసే వారు కాదని చెబుతారు.
ఇప్పుడు ఈ కల్లు పురాణం ఎందుకంటారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో తెలంగాణ ప్రాంతంలో కల్లు తాగడం ఆనవాయితీగా వస్తుందని,కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కల్లు తాగి నిజం చేశారు.
మద్యం తాగడం మానండి సురాపానకం (కల్లు) తాగండనే లెవల్లో స్వయంగా కల్లు తాగుతూ మెస్సేజ్ ఇచ్చారు.ఎమ్మెల్యే కల్లు తాగే దృశ్యం కెమెరాకు చిక్కడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.