ఏపీ సచివాలయం లోని నాలుగవ బ్లాక్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న హోం శాఖ మంత్రి తానేటి వనిత.హాజరయిన డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, టెక్నికల్ సర్వీస్ డిఐజీ పాలరాజు.
మహిళల భద్రత విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై మండిపడ్డ హోంమంత్రి.గత టీడీపీ హయాంలోనే మహిళపై అత్యధిక దాడులు జరిగాయని పేర్కొన్న హోం మినిస్టర్.నేర విచారణ విషయంలో టీడీపీ పాలనలో 159 రోజుల సమయం పట్టెదన్న హోంమంత్రి.2022 లో కేవలం 28 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తున్నామన్న తానేటి వనిత.







