ఖమ్మం జిల్లా వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి భవనంకు పార్టీ సీనియర్ నాయకులు, సుందరయ్య నగర్ శాఖ 1 కార్యదర్శి మందడపు రామారావు 10 వేల రూపాయిలను విరాళంగా అందజేశారు.కార్ల్ మార్క్స్ జయంతి రోజున జన్మించిన తన మనవడు చావా రుద్రాన్ష్ 11వ పుట్టినరోజు సందర్భంగా బొడెపుడి భవనంలో కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.
అనంతరం పదివేల రూపాయలను విరాళంగా సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ కు అందించారు.ఈ సందర్భంగా మందడపు రామారావు మాట్లాడుతూ మార్క్స్ పుట్టిన రోజున తన మనవడు చావా రుద్రన్ష్ పుట్టడం తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
అనంతరం వైరా పట్టణంలోని బాలవెలుగు పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి, అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సుతకాని జైపాల్, సిపిఐ (ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, దార్నా రాజశేఖర్, దార్నా వెంకటేశ్వరరావు, మందడపు వాసు, పణితి సైదులు, సీతారాములు, మందడపు చంద్రకళ, మందడపు విశ్వశాంతి, చావా జయదీర్, గుడిమెట్ల మెహనరావు తదితరులు పాల్గొన్నారు.







