సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం నరసయ్యగూడెం ఏ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ కొంత ప్రభావం చూపినా తెలంగాణలో లేదని,ఇక టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండి (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా చేయబోయి బొక్క బోర్లా పడిందని తెలిపారు.
ప్రత్యర్ధి లేడని నిర్లక్ష్యంగా ఉండొద్దని,ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేసి ప్రతి బూతులో రిజల్ట్ వచ్చేలా కృషి చేయాలని,దేశంలోనే నల్గొండ పార్లమెంట్ స్థానానికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కోరారు.హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్దిపై పనులు మొదలు పెట్టానని,జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పై రివ్యూ చేశానని,పనులు జరుగుతున్నాయన్నారు.
నాయకులు ఎవరైనా గ్రామ సమస్యలపై రావాలని, ఫైరవీల కోసం కాదన్నారు.పనిచేయడానికి హుజూర్ నగర్ లో ఇద్దరు పిఏలు ఉన్నారని,ఏ పని ఆగదని స్పష్టం చేశారు.పార్టీ లో ఎవరు చేరిన చేర్చుకోవాలని,ఇతర పార్టీల వారిని పార్టీలోకి రానివండని చెప్పారు.ఆదివారం జరిగే బూత్ లెవల్ సమావేశానికి నేరేడుచర్ల,పాలకవీడు మండలాలకు చెందిన అన్ని బూతుల నుండి కార్యకర్తలు హాజరు కావాలన్నారు.
అనంతరం నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిన వారికి కండువు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.