Sleeping Problems : ఎంత ట్రై చేసిన రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? అయితే ఇది మీ డైట్ లో ఉండాల్సిందే!

సాధారణంగా కొందరికి రాత్రుళ్ళు ఎంత ట్రై చేసినా నిద్ర పట్టనే పట్టదు.డిప్రెషన్, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం తదితర అంశాలు నిద్రను ప్రభావితం చేస్తుంటాయి.

 If You Take This Drink At Night, You Will Sleep Peacefully , Sleep, Sleeping, Sl-TeluguStop.com

అయితే ఒక‌టి లేదా రెండు రోజులు నిద్ర ప‌ట్ట‌కుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.కానీ, కంటిన్యూగా కంటి నిండా నిద్ర లేకుండా చాలా నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డిపోతుంది.పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టుముట్టేస్తాయి.

అందుకే చాలా మంది నిద్ర పట్టడం కోసం మందులు వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే ఎలాంటి మందులు వాడకుండానే హాయిగా మరియు ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి.

పాలు రెండు నుంచి మూడు నిమిషాల పాటు హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.అనంతరం పాలను స్ట్రైన‌ర్ స‌హాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Sleep, Tips, Immune System, Latest, Problems-Telugu Health Tips

ఈ పాలు గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా కలిపి రాత్రి నిద్ర పోవడానికి గంట ముందు సేవించాలి.ప్రతి రోజూ ఈ డ్రింక్ ను తీసుకుంటే ప్రశాంతమైన మరియు నాణ్యమైన నిద్ర మీ సొంతం అవుతుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు మునుపటి కంటే వేగంగా మరియు చురుగ్గా పనిచేస్తుంది.

మరియు దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్న త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube