Actress snigdha: అమ్మాయికి గడ్డాలు, మీసాలు ఉంటే పాపమా.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి స్నిగ్ధ!

మామూలుగా ఆడవారికి, మగవారికి ముఖంపై వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి.మగవారికి మాత్రం గడ్డం, మీసాలుగా ఉంటాయి.

 Is It A Sin If A Girl Has Beards And Mustaches Actress Snigdha Made Shocking Com-TeluguStop.com

కానీ ఆడవాళ్లకు కూడా అదే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి.కానీ చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే కొంతమంది ఆడవాళ్లకు మాత్రమే అలా మీసాలు, గడ్డాల మాదిరిగా వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి.

అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో బ్యూటీ పార్లర్స్, లేజర్స్ వంటివి ఉన్నాయి కాబట్టి చాలామంది ఆడవాళ్లు తమ ముఖంపై కనిపించే వెంట్రుకలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటారు.అయితే ఈ వెంట్రుకలు అమ్మాయిలకు గడ్డాలు, మీసాలుగా ఉంటే సమాజం మరోలా చూస్తుంది.

అంటే వారిని ఇబ్బంది పెట్టేలాగా చేస్తుంది.

దీంతో చాలామంది ఆడవాళ్లు వాటిని తట్టుకోలేక ఎప్పటికప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వెంట్రుకలను తొలగించుకుంటూ ఉంటారు.

అయితే ఈ విషయం గురించి చాలావరకు సెలబ్రిటీలు కూడా పంచుకుంటూ ఉంటారు.ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ కూడా ఈ విషయం గురించి పంచుకుంది.

ఇంతకు ఆమె ఎవరో కాదు లేడీ కమెడియన్ స్నిగ్ధ. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అమ్మాయిలకు గడ్డాలు, మీసాలు ఉంటే తప్ప అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి స్నిగ్ధ గురించి అందరికి పరిచయమే.ఈమె చూడటానికి అచ్చం అబ్బాయిలాగా ఉంటుంది.తను నటించిన సినిమాల్లో కూడా అబ్బాయి లాగానే నటించింది.

కమెడియన్ పాత్రలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాందించుకుంది.

తొలిసారిగా స్నిగ్ధ నందినీరెడ్డి దర్శకత్వంలో 2011 లో తెరకెక్కిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, దమ్ము, టైగర్, కల్యాణ వైభోగమే వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు బుల్లితెర షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా రచ్చ చేస్తుంది.

ఇక ఈమెకు నంది పురస్కారం కూడా అందింది.ఇక ఈమె చివరిగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో నటించగా ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలలో కూడా అడుగుపెట్టలేదు.

అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన గురించి చెబుతూ ఉంటుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.అందులో యాంకర్ ఆమెను తన ఫేస్ పై ఉన్న వెంట్రుకల గురించి ప్రశ్నించడంతో.దాని గురించి ఆమె కొన్ని విషయాలు పంచుకుంది.

అవి ఎవరికైనా ఉంటాయి అని కానీ ఇప్పుడు లేజర్ ని వంటివి చేయించుకుంటున్నారు కాబట్టి ఎవరికి కనిపించడం లేదు అని తెలిపింది.

ప్రస్తుతం తను దీక్షలో ఉన్నాను అంటూ అందుకే క్లీన్ చేయించు కోవడం లేదంటూ తెలిపింది.

ఇది ప్రతి ఒక్క ఆడవారికి ఉంటుంది అని.అవే బ్యూటీ పార్లర్లు, లేజర్ పార్లర్లు మూసివేస్తే ప్రతి ఒక్కరికి గడ్డాలు, మీసాలు కనిపిస్తాయి అని.అయినా అమ్మాయిలకు అలా ఉంటే పాపమా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube