మీరు ఏ ఆహారం తిన్నా చాలా ఉప్పగా ఉందా.. అయితే మీకు ఈ అనారోగ్య సమస్య ఉన్నట్లే..?

కొంతమందికి ఏది తిన్న నోట్లో చాలా ఉప్పగా ఉంటుంది.ఇలా ఎవరికైనా నోరు ( Mouth )ఉప్పగా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 Any Food You Eat Is Too Salty.. But You Have This Health Problem , Mouth, Dehy-TeluguStop.com

వాటిలో ముఖ్యమైనవి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, డిహైడ్రేషన్( Dehydration ), లాలాజల గ్రంధి ఇన్ఫెక్షన్, జలుబు ( cold )లేదా ఫ్లూ, ఆల్కహాల్ లేదా కెఫిన్ అధికంగా తీసుకోవడం, యాంటీ థైరాయిడ్ ( Thyroid )మందులు, హీమోథెరపీ మరియు అలర్జీలు ఇలాంటి అనేక సమస్యలకు దారి తీస్తాయి.ఇంకా చెప్పాలంటే విటమిన్ బి 12 మరియు జింక్ పోషకల లోపం వంటి ఇతర కారణాల వల్ల ఒక వ్యక్తి యొక్క నోరు చాలా ఉప్పగా ఉంటుంది.

కొన్ని సహజమైన మరియు ఆయుర్వేద నివారణలతో నోరు ఉప్పగా ఉండేటు వంటి సమస్యను దూరం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే అతి సాధారణ కారణం ఎక్కువగా ఉప్పు తీసుకోవడం.

Telugu Ayurvedic, Flu, Tips, Mouth, Multi Vitamin, Salt, Thyroid-Telugu Health T

కాబట్టి ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి.అలాగే పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవడం మంచిది.అలాగే ఎండిన ఆఫ్రికాట్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అత్తి పండ్లను, ఆవకాడో, ఎండుద్రాక్ష, కీవి పండ్లు, బచ్చలి కూర, దుంపలు, గుమ్మడికాయ, గ్రీన్ బీన్స్, పెరుగు, బ్రోకోలీ, బీన్స్ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. నోటిలో ఉప్పు రుచిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మద్యం సేవిస్తున్న వారు మద్యానికి దూరంగా ఉండాలి.మీరు మద్యపానానికి దూరంగా ఉండగలిగితే ఈ సమస్య త్వరగా ఉపశమనం అవుతుంది.

Telugu Ayurvedic, Flu, Tips, Mouth, Multi Vitamin, Salt, Thyroid-Telugu Health T

అలాగే ఆహారంలో ఉప్పు ( salt )తగ్గించి నీరు తీసుకోవడం పెంచాలి.కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ ( Multi vitamin supplements )తీసుకోవాలి.పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.మసాలా మరియు వేడి ఆహారాలకు దూరంగా ఉండాలి.తరచుగా చల్లటి నీటితో పుక్కిలించాలి.ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది.

ఇది టూత్ పేస్ట్ వల్ల వస్తుందని మీకు అనిపిస్తే మీ టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ ను మార్చడం మంచిది.రోజుకు కనీసం నాలుగు సార్లు నోరు శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల మీరు ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube