దళిత బంధు దగాపై దళితుల దండోరా

సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో అర్హులైన వారిని పక్కన పెట్టి,అధికార పార్టీకి చెందిన అనర్హులను దళిత బంధు( Dalitha Bandhu Scheme )కు ఎంపిక చేశారని,దీనికి పూర్తి బాధ్యత గ్రామ సర్పంచ్ దేనని,ఆయన దళితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట అర్హులైన దళితులు ధర్నా నిర్వహించారు.

అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని,అనర్హులకు దళిత బంధు ఎంపిక చేశారని,దీనికి సర్పంచ్ పంచాయతీ దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సర్పంచ్ గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎంతసేపటికి రాకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ ధర్నాకు పాలకవీడు మండల పరిషత్ వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్ రావ్,సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్,మండల నాయకులు వడ్డే సైదయ్య,ఆర్లపూడి వీరభద్రం సంఘీభావం తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ( CM KCR )ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు కింద పది లక్షలు ఆర్థిక సాయమందిస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని, కానీ,నేడు దళిత బంధు పథకం నిర్వీర్యం చేస్తూ ఒక్కొక్క గ్రామంలో ఐదారు యూనిట్స్ మంజూరు చేయడం వల్ల దళితవాడల్లో దళితుల మధ్య ఘర్షణల చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన దళిత కుటుంబాలకు దళిత బంధ పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

గ్రామంలో వచ్చిన 8 దళిత బంధు ఇతర దేశాల నుండి యూనిట్లను గ్రామసభ ద్వారా కాకుండా కనీసం దళితులందరిని పిలిచి వారిలో అర్హులుగా ఉన్న వారిని ఎంపిక చేయకుండా తమ ఇష్టానుసారంగా అధికార పార్టీ వారు ఎంపిక చేయటం పట్ల దళితులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు.ఇప్పటికైనా దళిత బంధు,ఇతర పథకాల్లో రాజకీయ జోక్యం లేకుండా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మరియు సిపిఎం గ్రామ కార్యదర్శి ఆర్లపూడి వీరభద్రం( veerabhadram ) కాంగ్రెస్ నాయకులు వార్డు మెంబర్లు గోల్కొండ అంజి, సత్యనారాయణ గ్రామ దళితులు పొలకట్ల సతీష్, ఇరుకు వెంకటేశ్వర్లు,కడప సైదులు,పొలకట్ల సుజాత, పొలకట్ల సైదమ్మ,కుక్కల జ్యోతి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : ఎమ్మెల్యే మందుల సామేల్
Advertisement

Latest Suryapet News