సోషల్ మీడియా( Social Media ) వాడకం మరింత పెరిగిపోతుంది.కొత్త కొత్త సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఒకదానికి పోటీగా మరోక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.ఇప్పటికే ఫేస్ బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలు ఉండగా.
వీటికి పోటీగా ఇంకా అనేక సోషల్ మీడియా యాప్స్ వస్తోన్నాయి.కొత్త ఫీచర్లతో యువతను కంపెనీలు బుట్టలో వేసుకుంటున్నాయి.
దీంతో వాటికి యువత బానిసై.గంటల కొద్ది సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో గడిపేవారు కూడా చాలామంది ఉన్నారు.
విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం( Social Media Effect ) గురించి తాజాగా సర్వే సంచలన విషయాలు బయటపెట్టింది.విద్యార్ధుల మానసిక పరిస్థితిని సోషల్ మీడియా దెబ్బ తీస్తోందని సర్వే ద్వారా గుర్తించింది.సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, డిప్రెషన్( Depression ) తో బాధడుతూ తమ మీద విద్యార్థులు( Students ) నమ్మకం కోల్పోతున్నారని తెలిపింది.
కొంతమంది విద్యార్థులపై ఓ ఆన్ లైన్ సర్వేను నిర్వహించారు.ఈ సర్వేలో సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించే విద్యార్థులు ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగిస్తే ఏమీ కాదని, కానీ కొంతమంది చెడు విషయాలు వ్యాప్తి చేసేందుకు వాడుతున్నట్లు గుర్తించింది.వీటి వల్ల విద్యార్థుల్లో ఆందోళన( Stress ) పెరిగిపోతున్నట్లు తెలిసింది.
చదువుకునే విద్యార్థుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రమాదాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరించారు.దీంతో సోషల్ మీడియాకు యువత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
అవసరం అయినప్పుడు మాత్రం వాడాలని, అంతేకానీ గంటల కొద్ది ఉండవద్దని సూచిస్తున్నారు.గంటలకొద్ది ఉండటం వల్ల మానసికంగా దెబ్బతింటారని చెబుతున్నారు.
ఇటీవల ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.