ఎప్పుడైనా సడెన్‌గా పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడో, ఫంక్షన్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడో లేదా ఏదైనా ఆఫీస్ మీటింగ్ ఉన్నప్పుడో ముఖం గ్లోయింగ్‌గా మిరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.అందుకోసం మార్కెట్ లో లభ్యమయ్యే రకరకాల ఇన్‌స్టెంట్ ఫేస్ మాస్క్‌లను కూడా ఉపయోగిస్తుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ మాస్క్‌ను ట్రై చేస్తే మాత్రం కేవలం ముప్పై నిమిషాల్లో ముఖం గ్లోయింగ్‌గా మరియు ఎట్రాక్టివ్‌గా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మాస్క్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వైట్ రైస్ ను వేసుకుని వాటర్‌తో ఒకసారి కడగాలి.
ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత స్ట్రైనర్ సాయంతో రైస్ వాటర్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో సపరేట్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్‌ను పోయాలి.

అలాగే ఆ రైట్ వాటర్‌లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్, రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ వేసి చిన్న మంటపై ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి.ఆపై గ్రీన్ టీ బ్యాగ్స్‌ను తొలగించి ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఏదైనా బ్రష్ సాయంతో ఆ మిశ్రమాన్ని ముఖంపై కాస్త మందంగా అప్లై చేయాలి.
ముప్పై నిమిషాల అనంతరం వేసుకున్న మాస్క్‌ను స్మూత్‌గా తొలగించాలి.ఈ న్యాచురల్ మాస్క్‌ను ట్రై చేస్తే డల్ గా ఉన్న స్కిన్ బ్రైట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.చర్మంపై ఏమైనా మలినాలు ఉన్నా తొలగిపోయి ముఖం ఫ్రెష్‌గా మెరుస్తుంది.