అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలకు వణుకు పుట్టిస్తోంది.వైరస్ ఉధృతి తగ్గింది అని రిలాక్స్ అయ్యేలోపే.
మళ్లీ విశ్వ రూపం చూపిస్తోంది.ఫస్ట్ వేవ్‌లో వచ్చిన కరోనా అధికంగా వృద్ధులపైనే ప్రభావం చూపేది.
కానీ, సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా మాత్రం పిల్లలు, పెద్దలు, బలవంతుడు, బలహీనుడు అనే తేడా లేకుండా అందరినీ ముంచేస్తుంది.దీంతో వేలల్లో నమోదయ్యే కరోనా కేసులు.
గత ఇరవై రోజులుగా లక్షల్లో నమోదు అవుతున్నాయి.
ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.
ఈ మహమ్మారి వేగం తగ్గడం లేదు.ఈ క్రమంలోనే ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
అయితే కరోనా బారిన పడినప్పుడు తెలిసి, తెలియని పొరపాట్లు చేసి కొందరు రిస్క్ లో పడుతున్నారు.ముఖ్యంగా మధుమేహం, రక్త పోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, శ్వాస కోశ సమస్యలు, హెచ్‌ఐవీ, క్యాన్సర్ తదితర వ్యాధులున్నవారిలో చాలా మంది కరోనా సోకినపుడు రెగ్యులర్‌గా వాడే మందులను వేసుకోవడం మానేస్తుంటారు.
మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు రెగ్యులర్‌గా వాడే మందులు వాడొచ్చా.వాడకూడదా.? అంటే వైద్యులు ఎలాంటి భయం లేకుండా వాడమనే చెబుతున్నారు.హోం ఐసోలేషన్‌లో ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నా రోగి రెగ్యులర్‌గా వేసుకునే మందులు మానకూడదని.
అలా మానితే ప్రాణాలే ప్రమాదంలో పడతాయని అంటున్నారు.
అలాగే కరోనా వైరస్ బారిన పడినప్పుడు ఇతరులతో పోలిస్తే.ఏదైనా వ్యాధులతో రెగ్యులర్‌గా మందులు వాడే వారే మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వీరు తీసుకునే ఆహారంలో మాంసం, కూరగాయలు, ఆకు కూరలు, నట్స్, పప్పు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.
ద్రవ పదార్థాలు, పండ్ల రసాలు తరచూ తీసుకోవాలి.ఒత్తిడి తగ్గించుకోవాలి.
ప్రతి రోజు వీలైనంత సమయం పాటు వ్యాయామం చేయాలి.తద్వారా కరోనా నుంచి త్వరగా బయటపడతారని అంటున్నారు.