మీరు పాస్తా ప్రియులా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి లేకపోతే చాలా నష్టపోతారు!

పాస్తా( Pasta ). ఇటీవల కాలంలో మోస్ట్ పాపులర్ ఫుడ్స్ లో ఒకటి.

 Is Pasta Healthy Or Unhealthy?, Pasta, White Pasta, White Pasta Side Effects, La-TeluguStop.com

పాస్తా అనేది ఇటాలియన్ వంటకం.పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి పాస్తా అనేది ఫేవరెట్ ఫుడ్ గా మారింది.

పాస్తాను రకరకాలుగా వండుకుని తింటుంటారు.నిత్యం పాస్తా తినేవారు కూడా ఎంతో మంది ఉన్నారు.

మీరు కూడా పాస్తా ప్రియులా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాల‌ను మీరు తెలుసుకోవాల్సిందే.లేకపోతే చాలా నష్టపోతారు.

Telugu Tips, Latest, Millet Pasta, Pasta, White Pasta, Whitepasta, Grain Pasta,

పాస్తా ఆరోగ్యానికి మంచిదే.కానీ వైట్ పాస్తా మాత్రం కాదు.వైట్ పాస్తా లో కార్బోహైడ్రేట్స్( Carbohydrates ) భారీ మొత్తంలో ఉంటాయి.

అందువల్ల వైట్ పాస్తాను తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు.మధుమేహం వచ్చే రిస్క్ పెరుగుతుంది.

రక్తపోటు అధికం అవుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ రెట్టింపు అవుతుంది.

అందుకే వైట్ పాస్తాను పొరపాటున కూడా తీసుకోకండి.దానికి బదులుగా హోల్ గ్రెయిన్ పాస్తాను ప్రిఫర్ చేయండి.

లేదా మిల్లెట్ పాస్తాను ఎంచుకోండి.

వీటి ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.

ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. హోల్ గ్రెయిన్ పాస్తా( Whole Grain Pasta ), మిల్లెట్ పాస్తాలో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, రాగి, ఫాస్పరస్ ఇలా బోలెడు పోషకాలు నిండి ఉంటాయి.

వైట్ పాస్తా కి బదులుగా వీటిని తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా అద్భుతంగా సహాయపడతాయి.

Telugu Tips, Latest, Millet Pasta, Pasta, White Pasta, Whitepasta, Grain Pasta,

హోల్ గ్రెయిన్ పాస్తా, మిల్లెట్ పాస్తా( Millet Pasta )ల‌ను డైట్ లో చేర్చుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు.అతి అక‌లి దూరం అవుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.కాబట్టి ఇకపై పాస్తా ప్రియులు వైట్ పాస్తా కు బదులుగా హోల్ గ్రెయిన్ పాస్తా లేదా మిల్లెట్ పాస్తాను ఎంచుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube