సూర్యాపేట జిల్లా:జూబ్లీహిల్స్ లో మైనర్ అమ్మాయి సామూహిక అత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని,ఆమెకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాకు జిల్లా నుండి బయలుదేరిన బీజేపీ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పొలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రజాకార్ల ప్రభుత్వం నడుస్తుందని,బాలికకు జరిగిన అన్యాయంపై నిరసన తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటని అన్నారు.
ఇదేనా ప్రజాస్వామ్యం అంటే షేమ్ షేమ్ కేసీఆర్ అంటూ మండిపడ్డారు.అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడం చేతగాక మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర హోం మంత్రి మనవడు,ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు,రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు,రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితులైన వారి పిల్లలు నిందితులుగా ఉండడంతో ఉద్దేశ్యపూర్వకంగానే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి తొత్తుగా మారిందని ఆరోపించారు.ముందస్తు అరెస్టయిన వారిలో బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర,జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్,మైనార్టీ అధ్యక్షడు మీర్ అక్బర్,జిల్లా బీజేపీ నాయకులు అర్రూరి శివ,రాపర్తి రాము,జల్లి గణేష్,కెక్కిరేణి ఆనంద్,రాపోలు ఉపేందర్ తదితరులు ఉన్నారు.