సూర్యాపేట జిల్లా:తమతో కలసి పనిచేస్తున్న తోటి తపాలా ఉద్యోగి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని తోటి ఉద్యోగుల ఆర్థికసాయం అందజేసి దాతృత్వం చాటారు.వివరాల్లోకి వెళితే సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద బిపిఎం నౌసిన్ భర్త షాబుద్దీన్ ఇటీవల మృతి చెందాడు.
వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో విషయం తెలుసుకున్న తపాల ఉద్యోగులంతా కలిసి కొత్త ఆర్థిక సహాయం చేయాలనుకున్నారు.అనుకున్నదే తడవుగా అంతా కలసి సూర్యాపేట డివిజన్తో పాటు తెలంగాణ,ఆంధ్ర సర్కిల్ లోని తపాల ఉద్యోగులు అందరూ కలసి రూ.51,645లను సేకరించారు.ఈ సేకరించిన ఆర్థిక సహాయాన్ని శనివారం బాధితురాలి నివాసానికి వెళ్లి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఐఈ సూర్యాపేట ఎస్ ఓలోని జీడీఎస్ ఉద్యోగులు ఎండి.గౌసియా బేగం, దేవదాన మేరీ,సౌజన్య,మాధవి,చికిత,సోని, సత్యవతి సమతా,స్వాతి,శ్రీజ ద్వారా నౌసిన్ కుటుంబానికి అందించటం జరిగింది.