సూర్యాపేట జిల్లా:తెలంగాణలో తిరుగుదాం రాత్రి వస్తావా,పగలు వస్తావా?కేసీఆర్ వల్ల జాతీయ రాజకీయాల్లో ముప్పు ఉందనే బీజేపీ భయం.అబద్ధాలతో చరిత్రకెక్కేతొలి హోమ్ మంత్రి అమిత్ షా.
కేసీఆర్ కి మించిన నాయకుడు దేశంలోనే లేడు.కాంగ్రేస్,బీజేపీ రహస్య ఒప్పందం త్వరలో బయటపెడతాం.
మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శనివారం తుక్కుగూడ సభలో మాట్లాడి మాటలు తుప్పు పట్టినట్లుగా ఉన్నాయని,ఆయన స్థాయిని దిగజార్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి తలపెట్టిన సంగ్రామ యాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన తెలిసి తెలంగాణకు మేలు చేసే కొత్త పథకం ఏమైనా చెబుతారేమోనని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలిందని తెలిపారు.అమిత్ షా అంటే అమితంగా అబద్దాలు మాట్లాడే షా గా మారాడని,దేశ చరిత్రలో మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే చెప్పే ఏకైక హోమ్ మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర రాజధాని నుండి మారుమూల తండా వరకు మిషన్ భగీరథ మంచినీరు,వైకుంఠ ధామాలు,పల్లె ప్రకృతి వనాలు,24 గంటల విద్యుత్ కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందా? మీ పాలనలో చీకటిలో మగ్గుతున్న ఉత్తరప్రదేశ్,గుజరాత్,మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయా? అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని చెప్పిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమిత్ షా అంటే అమితమైన అబద్దాలు చెప్పే షా అని నిన్నటి మీటింగ్ తో నిరూపించి పోయాడు తప్ప ఆయన ఒరగబెట్టింది ఏమి లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.భారత దేశంలో అత్యంత అబద్దాలు ఆడిన హోమ్ మినిస్టర్ గా అమిత్ షా రికార్డు సృష్టిస్తాడని అన్నాడని చెప్పారు.
కెసిఆర్ పైన విషం చిమ్మడం తప్ప నిన్నటి మీటింగ్ లో విషయమేదీ లేదని మంత్రి అన్నారు.తెలంగాణాలో తెరాస అధికార మార్పిడి కాదు,ఢిల్లీ గద్దె నుండి బీజేపీ దిగిపోవడం ఖాయం అయ్యిందని జగదీశ్ రెడ్డి అన్నారు.
కేంద్రం లక్షల కోట్ల అప్పులు చేయవచ్చు కానీ,రాష్ట్రాలు అబివృద్ది కోసం అప్పులు చేయకుండా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న చీకట్లు తెలంగాణాలో కూడా ఉండాలని బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.
తెలంగాణాలో అధికార మార్పిడి కాదు, జాతీయ స్థాయిలో కెసిఆర్ వల్ల ముప్పు ఉన్నదనే బీజేపీ నాయకులు భయంతో మాట్లాడుతున్నారని, బీజేపీ,కాంగ్రెస్ లు కలిసి కుట్రలు చేస్తున్నారని,వారి రహస్య ఒప్పందాన్ని త్వరలో బయట పెడతామని, ఏడిస్తే ప్రజలు అధికారం ఇవ్వరని,ప్రజల కోసం పని చేసే వాళ్ళకి అధికారం ఇస్తారని అన్నారు గుర్తు చేశారు.కొంగ జపం,దొంగ జపం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని,కెసిఆర్ ను వదులుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి అన్నారు.
డబల్ ఇంజిన్ ల వల్ల ప్రజలను దోచుకోవడం తప్ప,బీజేపీ నాయకులు చేసిందేమీ లేదన్నారు.