సూర్యాపేట జిల్లా:కోదాడ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ప్రజల అవసరాల కొరకు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం బిసి గర్ల్స్ హాస్టల్ కొరకు కేటాయించడం ఏమిటని కాలనీవాసులు ప్రశ్నించారు.మంగళవారం కాలనీ వాసుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ మరియు ఆర్ డి ఓ కి స్థల కేటాయింపును వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా బీసీ గర్ల్స్ హస్టల్ కోసం స్థలం కేటాయించడం సబబుకాదన్నారు.దీని వలన దినదినాభివృద్ధి చెందుతున్న కాలనీకి ఎటువంటి స్థలం లేకుండా పోతుందని,కాలనీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.
కాలనీ ప్రజలకు ముఖ్యంగా స్కూల్ కొరకు,కమ్యూనిటీ హాలు,క్రీడల గ్రౌండ్ కోసం ఆ స్థలం ఉపయోగ పడుతుందనన్నారు.కానీ,ఇక్కడ మాత్రం కాలనీవాసులకు సంబంధం లేకుండా ఎటువంటి ప్రజాభిప్రాయం లేకుండా బీసీ హాస్టల్ కొరకు స్థలం కేటాయించడం జరిగిందని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని కోరారు.
బీసీ గర్ల్స్ హాస్టల్ కోసం కోదాడ పట్టణంలో వేరొక చోటకు స్థలం చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్కే.
ముస్తఫా, మాతంగి బసవయ్య,సైదిబాబు,సోమగాని బాలయ్య,లిక్కి మోహన్ రావు,కొండ హరీష్, తిరుమలగిరి నరేష్,యాకోబు తదితరులు పాల్గొన్నారు.