సూర్యాపేట జిల్లా:కామ్రేడ్ మారోజు వీరన్న ( Maroju Veeranna )స్పూర్తితో మట్టిని తొలుచుకొని విప్లవాలు లేస్తున్నాయని సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ ( Kothapalli Siva Kumar )అన్నారు.
ఈ రోజు కామ్రేడ్ మారోజు వీరన్న 24వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విప్లవాల పురిటిగడ్డ,పోరు విత్తనాల మట్టినేల,కరివిరాల కొత్తగూడెంలోని ఒక నిరుపేద కుటుంబంలో కామ్రేడ్ మారోజు వీరన్న జన్మించాడన్నారు.
చిన్నతనం నుండే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ,ఉన్నత చదువులు చదివి,విద్యార్థి లోకాన్ని ప్రగతిశీల భావాల వైపు మల్లించడంలో ముందున్నడని గుర్తుచేశారు.
ఉద్యమాలు నిర్మించి,భారత విముక్తి పోరాటాలలో తన నిర్ణయం విస్పష్టంగా ప్రకటించి,ఆ నిర్ణయ అమలు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు.
ఈక్రమంలో మారోజు వీరన్నను ఆనాటి సర్కార్ బూటకపు ఎదురు కాల్పుల పేర బలిగొందని, మారోజు కలలు గన్న ఆ రోజు కోసం విప్లవ ఉద్యమాలు బలోపేతం చేయడం మన కర్తవ్యమని,ఆయన ఆశయాలను కొనసాగిద్దామని,అందుకు నిరంతరం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్( Akhil Kumar ),పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, వేర్పుల లక్ష్మయ్య, ఐ.ఎఫ్.టి.యు జిల్లా కార్యదర్శి భూక్యా రాంజీ, పివైఎల్ జిల్లా నాయకులు వీరబాబు,సునీల్, పి.డి.ఎస్.యు నాయకులు సింహాద్రి, సుధాకర్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.