సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని ఓ ఇంటిలో దొంగల పడ్డారు.పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటున్న భూక్య రవినాయక్ ఇంట్లో చోరికి పాల్పడి 57 వేల రూపాయల నగదు, మూడు తులాల బంగారం,15 తులాల వెండి,ఒక ల్యాప్టాప్,సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.
రవి నాయక్ కుటుంబం సొంత ఊరులో శీతల పండగ జాతర జరుగుతున్న సందర్భంగా ఇంటికి తాళంవేసి వెళ్లారు.ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
శుక్రవారం ఇంటికి తిరిగొచ్చిన రవినాయక్ ఇంటి డోర్లు పగలగొట్టి,బీరువాలు తెరచి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలికి చేరుకున్న కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.