ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేరు.
అంతలా ఈయన తన నటనతో ఆకట్టుకున్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోల లిష్టులో చేరిపోయాడు.
అయితే పుష్ప కంటే ముందు ఈయనకు కేవలం సౌత్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉంది.అయితే ఇప్పుడు అలా కాదు.
ఈయనకు రోజురోజుకూ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.
దీంతో ఈయన క్రేజ్ దృష్ట్యా ఈయనకు పలు కంపెనీల యాడ్స్ కూడా భారీ ఆఫర్స్ తో ఈయనను వరిస్తున్నాయి.
బన్నీ చేతిలో ఇప్పటికే చాలా యాడ్స్ ఉన్నాయి.మరి ఇప్పుడు మరోసారి యాడ్ షూట్ కోసం అల్లు అర్జున్ రెడీ అయిపోయాడు.అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి యాడ్ షూట్ చేసేందుకు రెడీ అయిపోయాడు.అందుకోసం ఏకంగా ఖండాలు దాటి మరీ ప్రయాణిస్తున్నారు.
ఈ ప్రకటన ను సుదూర తీరాన థాయిలాండ్ లో బీచ్ లో దట్టమైన అడవుల పచ్చదనం మధ్య షూట్ చేయబోతున్నారట.మరీ హరీష్ శంకర్ షూట్ చేయబోయే యాడ్ దేనికి సంబందించినది? ఈయన గెటప్ ఎలా ఉండబోతుంది? అనేది ఇంకా రివీల్ కాలేదు.మరి అల్లు అర్జున్ ఈ యాడ్ లో కూడా పుష్పరాజ్ గెటప్ లోనే దర్శనం ఇస్తాడా అనేది ముందు ముందు తెలుస్తుంది.
ఇక ప్రెసెంట్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈయనతో కలిసి భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించారు.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.
ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఈ సినిమా ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటుంది.
ఆగష్టు లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు సమాచారం.