సూర్యాపేట జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిని ఓ టీచర్ చితకబాదడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్న ధరావత్ పార్వతి-బాలు దంపతుల కుమారుడు సహాస్ ప్రిన్స్ ను ఈ విద్యా సంవత్సరమే స్థానిక లయోలా స్కూల్‌లో నర్సరిలో జాయిన్ చేయించారు.
విద్యాబుద్ధులు నేర్పించమని తల్లిదండ్రులు బాబును బడికి పంపగా తేజస్విని అనే ఉపాధ్యాయురాలు బాబును సోమవారం బెత్తంతో 14 దెబ్బలు కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు.మంగళవారం పాఠశాలలో ఈ విషయమై తల్లిదండ్రులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.
ప్రిన్సిపల్ సునీల్, కరస్పాండెంట్ లూయిదాస్ ఉపాధ్యాయురాలిని తొలగిస్తామని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినలేదు.చివరికి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు.