దోపిడి పీడన పాలన అంతానికి అగ్గిరాజేసిన యోధుడు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దివంగత భీమిరెడ్డి నర్సింహారెడ్డి 14 వ,వర్ధంతి వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యాతిధిగా హాజరై బిఎన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనగా నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాటాల ద్వారానే తెలంగాణాకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.

 The Warrior Who Undermined The End Of The Oppressive Regime-TeluguStop.com

నైజాం నిరంకుశత్వపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఉధృత రూపం ధరిస్తున్న సమయంలో ఇది యావత్ భారత దేశానికి వ్యాప్తి చెందుతుందన్న భయంతోటే బ్రిటిష్ పాలకులు దేశం నుండి తోక ముడిచిరాన్నారు.అందుకు దివంగత భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన తిరుగుబాటు ప్రధాన కారణంగా నిలిచిందన్నారు.

నైజాం నిరంకుశత్వపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేతగా బిఎన్ చరిత్ర సృష్టించారన్నారు.అటువంటి చరిత్రను దశదిశలా వ్యాప్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

దోపిడీ పాలన అంతానికి అగ్గి రాజేసిన మహా యోధుడుగా ఆయన కీర్తించబడుతున్నారని కొనియాడారు.అటువంటి మహానేత స్ఫూర్తి వర్తమాననికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అందులో భాగంగానే ఆయన స్ఫూర్తి ప్రతిభింబించేలా సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో వచ్చే వర్ధంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.తెలంగాణా సాయుధ రైతాంగా పోరాటం ద్వారానే యావత్ భారతదేశంలో ప్రజా చైతన్యం రగిల్చిండన్నారు.

ఈ దేశంలో ఒక రోజు బానిస మనస్తత్వంతో వెట్టి చాకిరిలో మగ్గుతున్న కాలంలోనే భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ చుట్టూ ఉన్న వారిని చూసి,పరిస్థితులను అధ్యయనం చేసి అసహ్యం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.అటువంటి దోపిడీ పాలన అంతానికి తనకున్న యవాదాస్తిని ఫణంగా పెట్టి ప్రజల కొరకు త్యాగం చేసిన యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అని కీర్తించారు.

పాత సూర్యాపేట తాలూకాతో పాటు తుంగతుర్తి,జనగామ ప్రాంతంలో ఇప్పటికీ భీమిరెడ్డిని కొలుస్తుంటారని తెలిపారు.తనకు జన్మనిచ్చిన అటువంటి ప్రాంతం గోదావరి నదీ జలాలతో సస్యశ్యామలం కావలన్నదే ఆయన తపన అన్నారు.

ఆ తపన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాకారం చేశారన్నారు.తాను నిర్మించిన పార్టీలో ఎన్ని కుట్రలు జరిగినా ప్రజల హృదయాలలో ఆయన చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వి.తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube