మహేష్ గ్లామర్ ను చూసి టాలీవుడ్ స్టార్స్ కుళ్లుకుంటున్నారా.. ఆయనకు మాత్రమే సాధ్యమంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందగాడైన హీరో ఎవరనే ప్రశ్నకు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు సమాధానంగా వినిపిస్తుంది.సాధారణంగా హీరోలకు వయస్సు పెరిగితే ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.

 Tollywood Stars Jealous On Super Star Mahesh Babu Details, Mahesh Babu, Mahesh G-TeluguStop.com

అయితే మహేష్ బాబు మాత్రం సంవత్సరం మారుతున్నా గ్లామర్ చెక్కు చెదరడం లేదు.మహేష్ బాబు తీసుకునే జాగ్రత్తల వల్లే ఆయన ఇంత గ్లామర్ గా కనిపిస్తున్నారు.

అయితే మహేష్ బాబు గ్లామర్ ను చూసి టాలీవుడ్ స్టార్స్ కుళ్లుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సులోనే లుక్స్ విషయంలో షేప్ అవుట్ అవుతూ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు హీరోలు సినిమాలలో అందంగా కనిపించడానికి సీజీపై ఆధారపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సీజీ కోసమే 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆఫ్ స్క్రీన్ లో కూడా మహేష్ బాబు అందంగా కనిపిస్తున్నారు.

Telugu Rajamouli, Mahesh Babu, Mahesh, Tollywood Stars, Trivkram-Movie

అయితే మహేష్ బాబు నిజ జీవితంలో ఇంత అందంగా కనిపించడానికి పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.డైట్ విషయంలో మహేష్ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారని వారంలో ఒకరోజు మాత్రమే తనకు ఇష్టమైన ఆహారాన్ని మహేష్ బాబు తీసుకుంటారని సమాచారం.సినిమాను బట్టి మహేష్ చేసే వ్యాయామాల విషయంలో మార్పులు చేసుకుంటారని తెలుస్తోంది.

Telugu Rajamouli, Mahesh Babu, Mahesh, Tollywood Stars, Trivkram-Movie

మహేష్ బాబు తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ఈ సినిమాను పూర్తి చేసి రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో మహేష్ నటించనున్నారు.మహేష్ బాబు వేగంగా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.మహేష్ బాబు ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

రాజమౌళి సినిమా నుంచి మహేష్ రెమ్యునరేషన్ ను పెంచే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube