ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై పిడి యాక్ట్ నమోదు చేయాలి:బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ

సూర్యాపేట జిల్లా: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాదరి కిషోర్ పై పిడి యాక్ట్ నమోదు చేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన న్యాయవాది యుగేందర్ ని ఆయన శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పరామర్శించారు.

 Pd Act Should Be Registered On Mla Gadari Kishore Bsp Chief Rsp,pd Act , Mla Gad-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అఖిల పక్ష ఆధ్వర్యంలో నిర్వహించే తిరుమలగిరి బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.డిఎస్పీ, ఎస్సై,సిఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

దాడిపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జగదీశ్ రెడ్డిని భర్తరఫ్ చేయాలన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులను టర్డ్ క్లాస్ ఫెలోస్ అంటూ వ్యాఖ్యలు చేయడం హేమమైన చర్య అని పేర్కొన్నారు.

సాండ్ మాఫియా,ల్యాండ్ మాఫియా చేసిన వారిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లే గాదరి కిషోర్ పై పిడి యాక్ట్ నమోదు చేయాలన్నారు.దాడిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహించే వారిని రాజకీయాల నుండి వెలి వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు, తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube