యాదాద్రి భువనగిరి జిల్లా: జనం టీవీ జర్నలిస్ట్ శంకర్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ నేత కుర్షిద్ పాషా అన్నారు.జర్నలిస్ట్ శంకర్ పై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ ఆదివారం ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి,వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతిని వెలికి తీసి ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జనం టీవీ శంకర్ పై అక్రమ కేసులు బనాయించి,ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.
పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి కలానికి సంకెళ్లు వేస్తున్నరని ఆరోపించారు.అక్రమ కేసులతో వేధించడం మానుకొని తక్షణమే జర్నలిస్ట్ శంకర్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమకొండ ఉపేంద్ర చారి,ప్రధాన కార్యదర్శి ఆరే భానుప్రసాద్,కోశాధికారి గుండు మహేందర్, జర్నలిస్టులు సామల సిద్ధులు(ప్రజా పక్షం), ఆరే సాయికుమార్ (నమస్తే తెలంగాణ),కొరుటూరి ఉపేందర్, సిరిగిరి స్వామి,ముల్లేకల రవికుమార్,సీసా సాయిరాం,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







