బుద్ధవనం సందర్శనకై ఆసక్తి కనబరిచిన దలైలామా...!

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ లో కృష్ణానది తీరంలో 274 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనo సందర్శించడానికి దలైలామా ఆసక్తిని కనపర్చారని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మీయ్య తెలిపారు.మంగళవారం ధర్మశాలలో దలైలామాను కలుసుకొని బుద్ధ వనాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించినట్లుగా ఆయన తెలిపారు.

 Dalai Lama Interested In Visiting The Buddha Temple , Dalai Lama , Buddha Temp-TeluguStop.com

ఈ సందర్భంగా 2006లో కాలచక్ర పూజ యాత్రలో భాగంగా దలైలామా బుద్ధ వనంలో నాటిన రావి మొక్క వృక్షంగా మారిందని దానికి సంబంధించిన ఫోటోలను వారికి అందించి బుద్ధవనం జ్ఞాపికను అందజేశారు.

బుద్ధవనం ప్రత్యేకతలు, నిర్మాణ శైలి, అపూర్వమైన శిల్ప సంపద గురించి దలైలామాకు వివరించారు.

బుద్ధవనం కన్సల్టెంట్ బౌద్ధ విషయ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి ఈ సందర్భంగా ఆయన రాసిన బుద్ధిస్టు ఆర్కియాలజీ ఇన్ తెలంగాణ చారిత్రక పుస్తకాన్ని దలైలామాకు బహూకరించారు.వీరితో పాటు ఓఎస్డి కె.సుధాన్ రెడ్డి,సలహాదారు ఆచార్య సంతోష్ రౌత్,బౌద్ధ అభిమానులు కేకే రాజా, రామకృష్ణంరాజులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube