సూర్యాపేట జిల్లా:హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్ర జైలును నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించి,నియోజకవర్గంలో తప్పుడు కేసుల బారినపడి జైలుకెళ్లిన మేళ్లచెరువులోని మైనార్టీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తమ్ పరామర్శించారు.వారికి మరియు వారి కుటుంబాలకు చట్టపరమైన మరియు ఆర్థిక సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తొత్తులుగా ప్రవర్తిస్తూ వారి కనుసన్నల్లో పనిచేస్తున్న స్థానిక పోలీసుల తీరును ఖండించారు.పోలీసుల తీరు, అధికార పార్టీ దౌర్జన్యాలకు నిరసనగా భారీ ఎత్తున జైల్ భరో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.